2019లో రీ ఎంట్రీ తో బ్రేక్ అందుకున్న స్టార్స్
తెలుగుతో పాటు హిందీ,తమిళం,మలయాళం,కన్నడం ఇలా పలు భాషల్లో బిజీ స్టార్ గా రాణించి కొంతకాలం తెలుగుకి దూరం గా ఉన్నవాళ్లు రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నారు. ఇలా 2019లో రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళను పరిశీలిస్తే,సీనియర్ నటీమణి లక్ష్మి 67సంవత్సరాల వయస్సులో కూడా నటిగా తన సత్తా చాటుతోంది. దక్షిణాది భాషల్లోనే కాదు,హిందీలో కూడా హీరోయిన్ గా రాణించిన ఈమె ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది. ఆతర్వాత నుంచి అమ్మ,బామ్మ పాత్రలతో అలరించిన ఈమె నాలుగేళ్ల క్రితం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ మూవీ లో చేసి,ఆతర్వాత నుంచి తెలుగు కి దూరం అయింది.
అయితే 2019లో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు మూవీస్ తో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ మూవీలో బేబీగా లక్ష్మి నటన సూపర్బ్. స్వీట్ 16లా స్టెప్స్ వేయడంతో టాలీవుడ్ లో సంచలనం రేపింది. తర్వాత ఆగస్టులో వచ్చిన మన్మధుడు 2లో నాగార్జునకు అమ్మ పాత్రలో దర్శనమిచ్చింది. సెప్టెంబర్ లో వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ లో కథలో కీలక రోల్ బామ్మగా నటించి, ఎమోషన్స్ పండించింది.
ఇక సంక్రాంతికి వినయ విధేయ రామ మూవీలో ఒకప్పటి హీరోలు ప్రశాంత్,ఆర్యన్ రాజేష్ , హీరోయిన్ స్నేహ నటించారు. రామ్ చరణ్ నటించిన ఈ మూవీ దారుణ పరాజయం మూటగట్టుకుంది. అయితే ఈ ముగ్గురికి మంచి మార్కులే పడ్డాయి. ఈవిధంగా వీరికి మంచి బ్రేక్ ఇచ్చిన సంవత్సరంగా 2019 వీరి రీ ఎంట్రీ మిగిలింది. కాగా 1998లో రైల్వే కూలి మూవీ ద్వారా తెలుగులో నటించిన ముమ్ముట్టి 2దశాబ్దాల తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇస్తూ,మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ పాత్ర పోషించి అదరగొట్టేసాడు. తన ప్రాణం పెట్టి నటించాడా అన్నట్లు తన నటనతో ముమ్ముట్టి అలరించాడు.

