Movies

అందరు హీరోలను కవర్ చేసిన అల్లు అర్జున్

వచ్చాడయ్యో సామి…. నింగి సుక్కలతో గొడుగు…. ఇది మహేష్ భరత్ అనే నేను సినిమాలో పాట. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు వెళితే…. అందులో ప్రేక్షకులకు ఈ పాట వినిపిస్తుంది. ఈ పాటకు మహేష్ బాబులా అల్లు అర్జున్ స్టెప్పులేసే సీన్ కూడా చూడొచ్చు.

ఆ తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో ఐ వాన్నా ఫాలో ఫాలో పాట, ఆ తర్వాత హుషారులోని ఉండిపోరాదే పాట వస్తుంది. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి తరహాలో ఈ సినిమాలో ఓ సందర్భానికి తగ్గట్లు పాటలతో దర్శకుడు త్రివిక్రమ్ ఓ సిక్వెన్స్ డిజైన్ చేశారు. అందులో ముందుగా బయటి హీరోలను కవర్ చేశాడు అల్లు అర్జున్.

ఆ తర్వాత మొదలైంది అసలు పాట. ‘ఏవండీ అందరి హీరోల పాటలు వేశారు. మా పవన్ కళ్యాణ్ పాట వేయరా?’ అని సునీల్ అడుగుతాడు. అందుకు బదులుగా ‘సిట్యువేషన్ డిమాండ్ చేయడం లేదు’ అని అల్లు అర్జున్ చెప్తాడు. ‘పవన్ పాటకు సిట్యువేషన్ తో సంబంధం ఏంటి?’ అని సునీల్ చెప్పగా….

‘ఫాన్స్ డిమాండ్ మేరకు’ అని ‘గబ్బర్ సింగ్’లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాటకు టేబుల్ ఎక్కిమరీ అల్లు అర్జున్ స్టెప్పులు వేశాడు. అతడితో సునీల్ కూడా స్టెప్పులు వేశాడు. ‘చెప్పను బ్రదర్’ అని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ అనడంతో అతడిపై పవన్ అభిమానులు కత్తి కట్టారు. తరవాత కూల్ అయ్యారు. రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ ఫంక్షన్ లో ‘పవర్ స్టార్’ అనడంతో హ్యాపీ ఫీల్ అయ్యారు.

ఇప్పుడు సినిమాలో పవన్ పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు వేయడంతో మరింత ఖుషి అయి ఉంటారు. చివరలో చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’లో ‘అమ్మనీ తియ్యనీ దెబ్బ’కు స్టెప్పులు వేశాడు. మొత్తం మీద హీరోలు అందరినీ కవర్ చేశాడు అల్లు అర్జున్. అందరి హీరోల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."