Movies

అయ్యో… మహేష్ సినిమా హిట్ అయినా కూడా డబ్బులు రాలేదటగా…నిజమేనా…???

ప్రస్తుతం నెట్టింట్లో మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.ఇందులో భాగంగా తాజాగా విడుదలైనటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం కొన్నిచోట్ల సరైన వసూళ్లు రాబట్టి లేదని దాంతో అక్కడ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలానే నష్టపోయారని పలు వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అంతేగాక ఇలా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం కొత్తేమీ కాదని గతంలో వచ్చినటువంటి మహర్షి, భరత్ అనే నేను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, వంటి చిత్రాల విషయంలో కూడా ఇలాగే జరిగిందని అంటున్నారు.

కానీ నీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ లాభాల విషయంలో కొన్ని చిత్రాలు మాత్రమే బోల్తా పడ్డాయని, మిగిలిన చిత్రాలు బాగానే కాసుల వర్షం కురిపించినట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు కూడా అధికారికంగా తెలిపారని అంటున్నారు.అయితే ప్రస్తుతం ఈ సరిలేరు నీకెవ్వరు చిత్రం వసూళ్ల విషయమై నో బ్రేక్ ఈవెన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనే హాష్ ట్యాగ్ తో నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతుంది.ఇవన్నీ మహేష్ బాబు అంటే గిట్టని వారు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.

అయితే నెట్టింట్లో ఇంత జరుగుతున్నప్పటికీ మహేష్ మాత్రం ఈ విషయాలపై ఏమాత్రం స్పందించ డంలేదు.కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రం వసూళ్ళ విషయానికి వస్తే మాత్రం విడుదలైన మొదటి రోజే ఏకంగా 47.7కోట్లు కొల్లగొట్టి మంచి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది.అంతేగాక ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాల సరసాలు కూడా నిలిచింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."