RRR క్లైమాక్స్ కోసం షాకింగ్ బడ్జెట్
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఫిలిం నగర్ కథనం మేరకు దాదాపు 150 కోట్ల రూపాయలతో ఓ భారీ యాక్షన్ క్లైమాక్స్ ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని టాక్.
తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం పాత్రలో తారక్, మన్యం వీరుడు అల్లూరి పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఇద్దరు విప్లవ వీరులకు సంబందించిన కల్పిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్ర ఖని, హాలీవుడ్ స్టార్ ఒలీవియా మేరీస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
