Movies

ఒక్కో ఛానెల్ ఒక్కో హీరోను సెట్ చేసేసుకున్నారుగా.!

సంక్రాంతి పండుగ రావడంతోనే వెండి తెర మీదకు మన టాలీవుడ్ కు చెందిన హీరోలు తమ తమ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా మరికొంత మంది ఇదే నెలలో రావడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఇది వరకటిలా కాకుండా మన తెలుగు తెలివిజన్ ఛానెల్స్ కూడా ఒక అడుగు ముందుకేసి ఈ సంక్రాంతి పండుగకు అదే హీరోలతో గట్టిగానే ప్లాన్ చేసారని చెప్పాలి.వారు టెలికాస్ట్ చేస్తున్న షోలకు స్పెషల్ ఈవెంట్లకు తమ సీరియల్స్ కు ఇలా మన టాలీవుడ్ హీరోలను భలే సెట్ చేసేసుకున్నారు.

మొదటగా ఈటీవీ ఛానెల్ వారు నాగశౌర్య ను తమ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా తీసుకురాగా అదే నాగశౌర్యతో జీ తెలుగు వారు రెండు రోజులు ఒక స్పెషల్ ప్రోగ్రాం ను పెట్టారు.ఇదిలా ఉండగా నందమూరి హీరో అయినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ తో స్టార్ మా లోని వదినమ్మ సీరియల్ లో ఏకంగా ఒక పార్ట్ లో కూడా పెట్టేసారు.అన్నిటికన్నా ముఖ్యంగా అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అయితే జీతెలుగు వారు అసలు ఏ ఛానెల్ కూడా ప్లాన్ చెయ్యని విధంగా తమ సీరియల్స్ కు ప్రమోషన్స్ కూడా ఇప్పించేసారు.ఒక్క జెమినీ ఛానల్ మినహా మిగతా ఛానెల్స్ అన్నీ కూడా ఒక్కో హీరోను సెట్ చేసేసుకున్నారని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."