Movies

దిల్ రాజు కూతురుని ఎప్పుడైనా చూసారా… ఎవరికి తెలియని నిజాలు

సినీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా ఎంట్రీ ఇచ్చి,నిర్మాతగా మారి,బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన దిల్ రాజు అనగానే ఇండస్ట్రీలో ఓ గౌరవం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. దిల్ రాజు సినిమా తీస్తుంటే హిట్ ఖాయం అని చెప్పేయొచ్చు. ఈ స్పెషల్ క్రేజ్ తో అగ్ర నిర్మాతల్లో ఒకరుగా నిలిచారు. కథలో దమ్ముంటేనే సినిమా తీయడం వలన ఈయనకు ఈ క్రేజ్ వచ్చింది. అదే సక్సెస్ కి కారణం.

అంతేకాదు దిల్ రాజు హస్తవాసి మంచిదని,ఆయన చేతులమీదుగా ఎంట్రీ ఇస్తే ఇక తిరుగుండదని టాక్ తెచ్చుకున్నారు. ఇక ఈయన కూడా కొత్త వాళ్ళను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగా చూస్తే,దిల్ రాజు భార్య అనితా రెడ్డి 2017లో చనిపోయింది. ఈయనకు హన్షిత రెడ్డి అనే ఒక్క కూతురు ఉంది. తాజాగా అనిల్ సుంకర తో కల్సి సరిలేరు నీకెవ్వరు మూవీ నిర్మించి జనవరి 11న ఆడియన్స్ ముందుకి తెచ్చారు. ఇక దిల్ రాజు కూతురు ఇదే సమయంలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

సరిలేరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్నీ మహేష్ బాబు ప్రకటించి అందరినీ ఉత్సాహపరిచారు. ‘ఈవేళ చాలా మిరాకిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బేబీ బాయ్ పుడితే,దిల్ రాజు కూతురికి బేబీ పుట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది’అని మహేష్ బాబు చెప్పాడు. ఇంతకీ 2014లో అచ్యుత్ రెడ్డి తో హన్షిత రెడ్డి పెళ్లయింది. ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు పాప పుట్టింది. భార్య అనిత మళ్ళీ తమ ఇంట్లో పుట్టిందని దిల్ రాజు ఆనందంతో పొంగిపోతున్నారు. కాగా కూతురు హన్షిత రెడ్డి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బాధ్యతలు చూస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."