కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిజమైన ఆస్తి ఎంతో తెలుసా.?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనగానే తెలియని వారుండరు. విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా, ఆపై హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ విలక్షణ శైలి ఏర్పరచుకున్న నటుడు మోహన్ బాబు తెలుగు,తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో చేసాడు. తన సినిమాలతో కలెక్షన్స్ వర్షం కురిపించి కలెక్షన్ కింగ్ అనిపించుకున్న మోహన్ బాబు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు.
తన విలక్షణ నటనకు పద్మశ్రీ పురస్కారం అందుకున్న మోహన్ బాబు తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్ సంస్థను పెట్టి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇప్పటికే ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకుని దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. మంచికి మారుపేరుగా ఎందరికో సాయం చేస్తుంటారు.
అయితే మోహన్ బాబు ఏడాదికి ఎంత సంపాదిస్తాడు, అతడి ఆస్తి ఎంత, ఒక్కొక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే,ఇతడి ఆస్థి 356కోట్ల రూపాయలు. ఏడాదికి 8నుంచి 10కోట్లు రూపాయలు నటుడిగా సంపాదన ఉంటుంది. ఒక్కొక్క సినిమాకు 2కోట్ల నుంచి 3కోట్లు డిమాండ్ చేస్తాడట. ఏడాదికి 50నుంచి60కోట్లు ఏడాది నెట్ ఆదాయం ఉంటుంది. సొంత ఊరిలో లో 3 కోట్లు విలువచేసే ఇల్లుంది. రెండు సూపర్ లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్నాడు.
