Movies

ప్లాప్ నుండి తప్పించుకోవడానికి ఆ స్టార్ హీరోలు ప్రయత్నిస్తున్నారా?

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు స్వాతంత్ర సమరయోధులుగా కనిపించనున్నారు. బాహుబలి సిరీస్ భారీ విజయాల తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకులు ఆ చిత్రం ఫై చాల అంచనాలే పెట్టుకున్నారు. అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత నటించే చిత్రం ఫై ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి తో చిత్రం చేశాక ఏ హీరో ఆ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేదు. కనీసం హిట్ టాక్ కూడా సొంతం చేసుకోలేకపోయారు. తాజాగా వచ్చిన సాహో చిత్రం విషయం లో ఫేట్ మారలేదు.

అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరు నెక్స్ట్ చిత్రాన్ని కొరటాల శివ తో చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొరటాల శివ తీసిన ప్రతి చిత్రం బ్లాక్ బస్టరే. కొరటాల శివ తో సినిమా చేస్తే ప్లాప్ నుండి తప్పించుకోవచ్చనేది వీరిద్దరి అభిప్రాయం అని అర్ధం అవుతుంది. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరిలో ఎవరితో చేయాలో అర్ధం కాకా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్ హీరోలు కావడం తో కొరటాల శివ దీర్ఘాలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరి కొరటాల శివ ఎవరితో తన నెక్స్ట్ చిత్రాన్ని చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.