Movies

“లవర్స్ డే” రోజున లవర్స్ కోసం స్టార్ మా వండర్ ఫుల్ ట్రీట్!

ఏ కొత్త సంవత్సరం వచ్చినా సరే జనవరి నెల కోసం ఎలా అయితే చాలా మంది ఎదురు చూస్తారో అలాగే ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి నెల కోసం అంతే రీతిలో ఎదురుచూస్తారు.ఫిబ్రవరి రెండో వారం మొదలయ్యింది అంటే చాలు ఆ డే ఈ డే అంటూ “వాలెంటైన్స్ డే” వరకు తాము ప్రేమించే వ్యక్తిపై ఎన్ని రకాలుగా ప్రేమను వ్యక్తపరచాలా అన్ని రకాలుగా తమ ప్రేమను కురిపిస్తారు.

అయితే క్యాలెండర్ లో ఉన్న అనేక స్పెషల్ డేస్ లో “లవర్స్ డే” కూడా ప్రత్యేకమైనదే..అలాంటి ఈ వండర్ ఫుల్ ఎమోషనల్ రోజున తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి స్టార్ మా వారందరికీ ఒక అద్భుతమైన ట్రీట్ ను అందించనుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలుకొని రీసెంట్ వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ చిత్రాలను కొన్ని ఎంపిక చేసి టెలికాస్ట్ చేసి వారికి ట్రీట్ ఇవ్వబోతున్నారు.

మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా లవ్ జాన్రా చిత్రాల్లోని ది బెస్ట్ చిత్రం అయిన “తొలిప్రేమ” అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కల్ట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ “ఆరెంజ్”,కార్తికేయ మరియు పాయల్ రాజ్ పుత్ ల కాంబోలో వచ్చిన రియల్ లైఫ్ ఫైన్ ఫుల్ లవ్ స్టోరీ “ఆర్ ఎక్స్ 100” అలాగే టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ నటించిన ఆల్ టైం బోల్డ్ లవ్ స్టోరీ “అర్జున్ రెడ్డి” ఇక ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ ఒక పక్క కామెడి మరోపక్క మంచి ఎమోషనల్ లవ్ ట్రాక్ తో ఎంతగానో అలరించిన “నువ్వు నాకు నచ్చావ్” చిత్రాలను ఈ ప్రేమికుల దినోత్సవం రోజున టెలికాస్ట్ చెయ్యనున్నారు.దగ్గరగా ఉన్న ప్రేమికులకు ఏమో కానీ దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం స్టార్ మా ఛానెల్ నుంచి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."