Movies

భీష్మ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు…రిలీజ్ ముందే లాభాలు

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాతో మరో సూపర్‌హిట్‌పై కన్నేశాడు నితిన్.ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ చిత్రంపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి.అయితే ఈ సినిమా తాజాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ పూర్తి చేసుకుని చిత్ర నిర్మాతలకు రిలీజ్‌కు ముందే మంచి లాభాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌ను చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.

రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 45 కోట్లు
ఆంధ్ర – 8 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
మిగతా ప్రాంతాలు – 5.5 కోట్లు
నాన్-థియేట్రికల్ – 15 కోట్లు
టోటల్ ప్రీరిలీజ్ బిజినెస్ – 35 కోట్లు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."