Movies

భీష్మ సెన్సార్ రిపోర్ట్.. రన్‌ టైమ్ సినిమాకి ప్లస్ అవుతుందా…?

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మరికొద్ది రోజుల్లు రిలీజ్‌కు రెడీ అయ్యింది.దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నితిన్ మరో అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఇటీవల తెలుగు సినిమాలకు ‘యు’ సర్టిఫికెట్ రాలేదనే అసంతృప్తిని భీష్మ సినిమా తీర్చేసింది.

ఇక ఈ సినిమాకు ఒక్క కత్తెర కూడా పడలేదు.సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉందని, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆనందిస్తారని సెన్సార్ సభ్యులు కితాబిచ్చారు.ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలకు ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా నితిన్, రష్మికల కెరీర్‌లో ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.

సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."