Movies

వరల్డ్ ఫేమస్ లవర్ త్రీ డేస్ కలెక్షన్స్.. ప్లాప్ లాంఛనమే…!

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వాలంటైన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ అయిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లలో రిలీజ్ అయ్యి డివైడ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే ఎక్కడో సినిమా కాస్త తేడా కొట్టడంతో మూడు రోజులలోనే ప్లాఫ్ టాక్‌ని దక్కించుకుంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మూడు రోజులలో 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ చిత్రానికి విడుదలకి ముందు 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా, మూడురోజులకు గాను 10 కోట్ల షేర్ మాత్రమే రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. నోటా కంటే తక్కువగా ఈ సినిమాకు యూఎస్ లో వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా ఎంత డిజాస్టర్ దక్కించుకుందనేది తేలిపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."