మహేష్ బాబు సిక్స్ ప్యాక్ గురించి ఈ నిజాలు తెలిస్తే…
మహేష్ బాబు బాలనటుడిగానే తెలుగు పరిశ్రమకు పరిచయమై తండ్రితో కలసి ఎన్నో సినిమాలు చేశారు. ఇక ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇప్పటికీ ఎన్నో స్టార్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు మహేష్. పోకిరి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన మహేష్ బాబు దూకుడుతో ఆ ట్రెండ్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు.
ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ సిక్స్ ప్యాక్ తో ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదు. టాలీవుడ్ లో ఎక్కువగా సిక్స్ ప్యాక్ పైన దృష్టి పెట్టారు చాలామంది హీరోలు. అయితే మహేష్ మాత్రం ఫిట్ గా ఉంటాడు కానీ సిక్స్ ప్యాక్ తో మాత్రం కనిపించలేదు.
దాంతో అభిమానులు కూడా సిక్స్ ప్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులందరికి తెలియని ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…. మహేష్ బాబు ఇది వరకే సిక్స్ ప్యాక్ ట్రై చేశారట. కానీ మధ్యలో సిక్స్ ప్యాక్ ని ఆపేసినట్లు మహేష్ బాబు వెల్లడించారు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఎంతో ఫిట్ గా కనిపించిన మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో అందరిని ఆశ్చర్యపరుస్తాడు అని అనుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం తన బాడీ ఫిట్ నెస్ ని చూపించారు కానీ సిక్స్ ప్యాక్ మాత్రం చూపించలేదు.
