శ్రీముఖి ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది
శ్రీముఖి అనగానే అందరికి పటాస్ షో గుర్తొస్తది. పటాస్ లో శ్రీముఖి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే…. ఈ షోలో యాంకర్ రవితో శ్రీముఖికి సంబంధం ఉన్నదని ఎన్నో వార్తలు వచ్చాయి. వారిద్దరూ స్టేజ్ పై ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో వారి మధ్య రిలేషన్ ఇంకా పెరిగిందని అనుకున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం యాంకర్ రవి, శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకున్నారు. దాంతో ఆ షో ఊపు తగ్గింది.
అయితే కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చిన వారి జీ టీవీలో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. మళ్ళీ వారిద్దరి మధ్య రిలేషన్ పెరిగిందని అందరు అనుకుంటున్నారు. ఈ తరుణంలో శ్రీముఖి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అయితే అది ఆమె పెళ్లి కాదట. ఆమె సోదరి పెళ్లి అంట. శ్రీముఖి సోదరి పెళ్లి కావడంతో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను విడుదల చేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. శ్రీముఖీ పెళ్లి అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి కాదని తెలుసుకుని చాలా మంది సంతోషపడ్డారట.