Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో…ఎక్కడ ఉందో…?

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే పలు ఎంటర్టైనింగ్ షోలలో టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా చేసే “ఆలీతో సరదగా” ప్రోగ్రాం కూడా ఒకటి.ప్రతీ సోమవారం టెలికాస్ట్ అయ్యే ఈ షో ద్వారా టాలీవుడ్ కు చెందిన ఎందరో అగ్ర నటులతో అద్భుతమైన ఇంటర్వ్యూలు వస్తుంటాయి.అలా అలనాటి తారలు ఎంతో మంది ఈ తరం ఆడియన్స్ కు మరోసారి పరిచయం చేస్తూ ఆరోజుల్లోకి తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అలాగే ఇప్పుడు అలాంటి ఓ హీరోయిన్ ను ఈ షో ద్వారా తీసుకొచ్చారు.అప్పట్లో మాంచి మ్యూజికల్ హిట్టయిన “ఆనందం” సినిమాను ఎవరూ మర్చిపోరు.జై ఆకాష్ హీరోగా రేఖ వేదవ్యాస్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు.ఆ శ్రీను వైట్ల అప్పుడు పరిచయం చేసిన ఈ హీరోయిన్ రేఖనే ఇప్పుడు ఆలీ తన షోకు తీసుకొచ్చారు.

దీనికి సంబంధించిన ప్రోమోను గమనించినట్లయితే ఈమె చాలా విషయాలను పంచుకోడం కామన్ విషయమే కానీ ఈ ఎపిసోడ్ మొత్తం చాలా చలాకీగా మంచి హుషారుగా ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారని చెప్పాలి.ఆఖరుకు తనపై వచ్చిన నెగిటివ్ వార్తలను కూడా చాలా సింపుల్ గా తీసుకొని మాట్లాడ్డం ఈ ప్రోమో చూసిన వీక్షకులకు నచ్చక మానదు.

రేఖ వేదవ్యాస్ మన తెలుగులో ఆనందం,ఒకటో నెంబర్ కుర్రాడు,దొంగోడు,మన్మధుడు వంటి పలు చిత్రాల్లో నటించారు.మరి తాను ఇంకెన్ని విషయాలు ఎంత చురుకుగా తెలియజేసారో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 24 సోమవారం రాత్రి మీ ఈటీవీలో ప్రసారం కాబోయే “ఆలీతో సరదాగా” షోను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."