వెంకటేష్ బామ్మా కన్నుమూత…టాలీవుడ్ లో మరొక విషాదం
ప్రముఖ కన్నడ నటి కిషోరి బల్లాల్ కన్ను మూశారు. దాదాపు 75 సినిమాల్లో నటించిన ఆమె 2004 లో హిందీలో ‘స్వదేశ్’ సినిమాలో చెరిగిపోని ముద్ర వేశారు. 82 ఏళ్ల బల్లాల్ వయసు సంబంధిత వ్యాధులతో మరణించినట్టు బెంగళూరులోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1960 లో ‘ఇవలెంత హెందతి’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన బల్లాల్ ఐదు దశాబ్ధాలు సినీ రంగంలో పలు సినిమాల్లో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ భాషల్లో 75 సినిమాల్లో నటించారు.

