Beauty Tips

Beauty Tips:ఇలా చేస్తే.. అమ్మాయిలకు మేకప్ తో పనేముంది?

Beauty Tips in telugu:చాలా మంది అమ్మాయిలు ఫంక్షన్‌ అయినా, పార్టీ అయినా బయటికెళ్లాలనుకున్న తాము అందరికన్నా స్పెషల్ గా కనిపించాలనే ఉద్దేశంతో అనేక రకాల మేకప్‌ కిట్లను ఆశ్రయిస్తుంటారు.

ఒక్కోసారి కాస్త డబ్బులు పోయిన పర్వాలేదంటూ బ్యూటీపార్లర్ కి కూడా వెళ్తుంటారు. కానీ, మేకప్‌తో పని లేకుండా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు సహజంగా అందాన్ని పొందవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

1) మన బయటకు వెళ్ళిన్నప్పుడు ఎండ నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. అలాగే ఎండకు కందిపోదు. ఎండకు బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిది.
2) అందం కోసం సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడవద్దు. చర్మ ఆరోగ్యానికి ఆహారం ప్రధానమైంది. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన చర్మం కావాలనుకునే వారు యాంటీ ఆక్సిడెంట్లు, కొల్లాజెన్‌ స్థాయిలు అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది.
3) చర్మం కాంతివంతంగా ఉండేందుకు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. దీంతో చర్మంలోని మలినాలు తొలిగిపోయి మొటిమలు రావు. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మం మృదువుగా, నునుపుగా తయారవుతుంది.
4) కొందరి చర్మం పాలిపోయినట్లుగా, ముడతలు పడి ఉంటుంది. ఇందుకు నిద్రలేమి కూడా కారణంగా చెప్పొచ్చు. నిద్రపోవడం వల్ల కొల్లాజెన్‌ సహజంగా పెరుగుతుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది.
5) మొబైల్‌ ఫోన్‌ ఎక్కువగా వాడడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసుకోవడం మంచిది. ముబైల్‌ తెర ముఖానికి తాకితే మొటిమలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."