జబర్దస్త్ కుర్ర కమెడియన్ ఎక్కడ నుండి వచ్చాడో తెలుసా?
ఎనిమిదేళ్ళయినా సరే,ఇంకా జనంలో దూసుకుపోతున్న కామెడీ షోగా జబర్దస్త్ నిల్చింది. టి ఆర్పీ రేటింగ్ లో ఏమాత్రం జోరు తగ్గని ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఆర్ధికంగా నిలబెట్టింది. ఈ రోజు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న చాలా మంది కమెడియన్లకు జబర్దస్త్ వేదిక అయింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎంతోమంది నటులు ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నారంటే దానికి కారణం జబర్దస్త్ అని చెప్పక తప్పదు. ఇప్పటికీ చాలా మంది కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు మాత్రమే చాలా త్వరగా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు మాత్రం ఎమ్మాన్యువల్ ఓ కొత్త కమెడియన్ కనిపిస్తున్నాడు.
కొన్ని రోజులుగా వెంకీ మంకీస్ స్కిట్స్‌లో కనిపిస్తున్న ఎమ్మాన్యువల్ తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపులు చెక్కలు చేస్తున్నాడు. కాలం కలిసొస్తే, త్వరలోనే హైపర్ ఆదిలా టీం లీడర్ అయిపోయి సెటైర్ల వర్షం కురిపిస్తాడేమో అని అంటున్నారు. అందుకే ఈ కుర్ర కమెడియన్ గురించి ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. భలే చేస్తున్నాడు కామెడీ.. దానికితోడు పంచులు కూడా భలే వేస్తున్నాడు, ఇంతకీ అసలెక్కడి నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. అంటూ ఎమ్మాన్యువల్ గురించి గూగుల్‌లో తెగ సర్చ్ చేస్తున్నారు. చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా మనోడికి మంచి పేరే వచ్చింది. పైగా మెయిన్ స్కిట్ అంతా ఈయనే చేస్తున్నాడు.
వెంకీ మంకీస్ టీం కూడా ఎమ్మాన్యువల్ బేస్ చేసుకుని స్కిట్స్ అల్లుతున్నారు. దాంతో కుర్రాడు స్పీడ్‌గానే స్టార్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇతడి బ్యాగ్రౌండ్ చూస్తే, మల్లెమాలలోనే ఇతడి కెరీర్‌కు బీజం పడిందని అంటున్నారు. ఈటీవీ ప్లస్‌లో వచ్చే పటాస్ షో నుంచి జబర్దస్త్ కామెడీ షోకు ప్రమోషన్ అందుకున్నాడు. అక్కడ తనదైన శైలిలో స్టాండప్ కామెడీ చేయడంతో వెంకీ మంకీస్ తమ టీంలో ప్లేస్ ఇచ్చారు. వాళ్లతో పాటు మరిన్ని టీమ్స్‌లో కూడా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌లో ఇంతలా స్పీడ్ గా పేరు తెచ్చుకున్న కొత్త వాళ్లెవ్వరూ లేరు.అందుకే మిగిలిన టీం లీడర్స్ కూడా ఇతనిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

