Movies

చిరంజీవితో సినిమా చేయడం ఆ దర్శకుల పాపమా ..ఆ దర్శకుల పరిస్తితి ఏమిటో చూడండి

కొన్ని సెంటిమెంట్స్ బలంగా నాటుకుపోతే దాని ముందు ఏదీ సరిపోదు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని దర్శకులు మొత్తం కలలు కంటారు.. అలాంటిది ఆయనతో సినిమా చేయడం పాపం ఏంటి అంటే ఏమిటో తెలుసా. ఇప్పుడు ఇద్దరు దర్శకుల విషయంలో ఇదే జరుగుతుంది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో పని చేసిన దర్శకులు ఇద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు. వినాయక్ అయితే ఖైదీ నెం 150 తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. సాయి తేజ్ హీరోగా ఇంటిలిజెంట్ సినిమా అప్పుడెప్పుడో 2018 ఫిబ్రవరిలో విడుదల చేసాడు. ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు.

ఇక మధ్యలో బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా కుదర్లేదు. ఇక సైరా సినిమా తెరకెక్కించిన సురేందర్ రెడ్డి కూడా ఇప్పటి వరకు తర్వాతి సినిమా ఏంటనేది చెప్పడం లేదు. సైరా తెలుగులో విజయం సాధించినా కూడా మిగిలిన భాషల్లో డిజాస్టర్ అయింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ ఏం కాదు.. జస్ట్ హిట్ అంతే. కొన్నిచోట్ల అయితే పెట్టుబడికి కొద్ది దూరంలో ఆగిపోయింది.

సైరా విడుదలై ఆర్నెళ్లు గడిచింది.. చిరంజీవి కూడా మరో సినిమా మొదలుపెట్టాడు కానీ సురేందర్ రెడ్డి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. చిరంజీవి తర్వాత ఎవర్ని డైరెక్ట్ చేయాలో ఈయనకు అర్థం కావడం లేదు. అఖిల్ కోసం కథ రాసుకున్నాడనే ప్రచారం జరుగుతున్నా కూడా అతనొక్కడే తర్వాత ఈయన ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతో అయితే పని చేయలేదు. మొత్తానికి యాదృశ్చకమో ఏమో కానీ చిరంజీవితో సినిమా చేసిన తర్వాత ఈ దర్శకుల కెరీర్ ఏమి బాగాలేదు.