Movies

కోట్లు సంపాదించే మ్యూజిక్ డైరెక్టర్ ఇపుడు రోజుకి 35 రూపాయలు…!

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా భారత దేశం లాక్ డౌన్ అయింది. అయితే ఈ సమయంలో ఒక్కొక్కరూ తమ సమయాన్ని రకరకాలుగా వినియోగించుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు, సినిమా కి సంబందించిన పనులు ఆగిపోయాయి. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ కి ఎనలేని కీర్తప్రతిష్టలు తెచ్చిన కేజీఎఫ్ చిత్రం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం తన సొంత ఊరు లో తన తండ్రి తో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ సొంత ఊరు లో దేవుళ్ళకు ఆభరణాలు చేసే పనిలో పడ్డారు. లాక్ డౌన్ ప్రకటించగానే సొంత ఊరు వెళ్ళిన రవి బస్రూర్ తన తండ్రితో పాటుగా పని చేస్తున్నాడు. అందుకు గాను రోజుకి 35 రూపాయలు సంపాదిస్తున్నాడు అట. సినిమాలకు మ్యూజిక్ అందించే ఇతను, హిట్ సినిమాలకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటి వ్యక్తి 35 రూపాయలు సంపాదిస్తూ అనందిస్తున్నట్లు తెలుస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."