Movies

అంజి పాత్రకు ఎల్ బి శ్రీరామ్ అందుకే..!

మన తెలుగు సీరియల్స్ చరిత్రలోనే ఎవర్ గ్రీన్ సీరియల్ ఏదైనా ఉంది అంటే అది “అమృతం” అనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఈ సీరియల్ లో ఉన్న పాత్రలను కానీ ఈ సీరియల్ ను కానీ ఏదీ రీప్లేస్ చెయ్యలేదు. అయితే ఈ సీరియల్ లో అంజి పాత్రలో కనిపించిన గుండు హనుమంతురావు గారు దురదృష్టవశాత్తు ఇప్పుడు మన మధ్యన లేరు.

అయితే ఈ పాత్రకు గాను రెండో సీజన్లో ఎవరిని పెట్టాలి అన్న ప్రశ్న వచ్చినపుడు ఈ సీరియల్ సృష్టికర్త గుణ్ణం గంగరాజు గారికి పెద్ద తల నొప్పే వచ్చిందని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఆ పాత్రకు ముందు ఎల్ బి శ్రీరామ్ గారి పేరునే ముందు అనుకోలేదని అంజి అనే పాత్రలో ఒక్క గుండు హనుమంతురావు గారిని తప్ప సాక్షాత్తు ఆ దేవుడినే తీసుకొచ్చి పెట్టినా సరే తెలుగు ఆడియెన్స్ ఒప్పుకోరని కానీ చాలా ఆలోచనల తర్వాత ఆ పాత్రకు ఎల్ బి శ్రీరామ్ గారైతే కరెక్ట్ అనిపించి పెట్టామని ఆయన తెలిపారు.