Devotional

వైరల్ అవుతున్న వీడియో… వీడియోలో ఉన్నది తిరుమల శ్రీవారి గర్భగుడి కాదు

కరోనా కారణంగా తిరుమల శ్రీవారి దర్శణంకు భక్తులను అనుమతించడం లేదు.దేశ వ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల ఆలయంలోకి కూడా భక్తుల రాకపై ఏప్రిల్‌ 14 వరకు ఆంక్షలు ఉన్నాయి. పూర్తిగా భక్తుల రాకపోకలపై నిషేదం విధించడం జరిగింది.ఈ నేపథ్యంలో తిరుమల గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సమయంలో కొందరు తిరుమల శ్రీవారి అఖండ జ్యోతి ఆరి పోయిందనే వదంతులు కూడా పుట్టించారు.తాజాగా కొత్త వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.ఆ వీడియోలో కరోనా కారణంగా తిరుమల శ్రీవారిని చూడలేని వారికోసం ఇలా తిరుమల దేవస్థానం గర్బగుడి వీడియోను మొదటి సారి టీటీడీ వారు విడుదల చేశారు.ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూసి దేవుడి ఆశీర్వాదం తీసుకుని ఇతరులకు షేర్‌ చేయండి అంటూ అందులో ఉంది.

ఆ వీడియో చాలా మంది నిజమైనదే అనుకుంటున్నారు.చూడ్డానికి అలాగే ఉండటంతో అంతా ఫార్వర్డ్‌ చేస్తున్నారు.అయితే ఆ వీడియో నిజం కాదని టీటీడీ ప్రకటించింది.ఏదో ఒక సినిమాకో లేదా కార్యక్రమం కోసమో అచ్చు శ్రీవారి ఆలయంకు సంబంధించిన సెట్‌ వేశారు.అది ఇప్పుడు వైరల్‌ అవుతుందని వారు చెప్పుకొచ్చారు.