Movies

RRR విషయంలో జక్కన్న భయపడేది ఎందుకో తెలుసా?

బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ లో మల్టీస్టారర్ గా తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టాలీవుడ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా చూస్తామా…? రాజమౌళి ఎప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తారా అనేది అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

కరోనా ప్రభావం తగ్గిన తఃర్వాత చిత్ర యూనిట్ మళ్ళీ మిగిలిన షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ సినిమా మిగిలిన షూటింగ్ మహారాష్ట్ర లోని పూణే లో జరగాల్సి ఉంది. అక్కడ కరోనా వైరస్ తీవ్రంగాఉండడంతో ఇది మరింత కాలం వాయిదా పడేలా ఉందని చెప్పాలి ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.

ఇక తనకు అత్యంత నమ్మకస్తులు అయితేనే ఇప్పుడు సినిమా కు సంబంధించిన వర్క్ ని అప్పగిస్తున్నాడు. సినిమా షూటింగ్ చేసిన సీన్స్ ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. సంగీత దర్శకుడు, అలాగే నిర్మాత, తను, హీరోలు ఇద్దరికీ, కెమెరా మెన్ కి మినహా ఎవరికి అతను సీన్స్ ఇవ్వడం లేదట. దీనికి కారణం ఎక్కడ లీక్ చేస్తారో అనే భయం జక్కన్నకు ఎక్కువగా పొంచి వుంది.