మెగాస్టార్ ట్విట్ ఎంత పని చేసిందో…పాపం పూరి
ఉగాది నాడు ట్విట్టర్‌లో ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అవ్వడంపై చాలా మంది ఆనందంను వ్యక్తం చేస్తూ ఆయనకు వెల్‌కం పలికారు. తనకు వెల్‌కం పలికిన సెలబ్రెటీలకు విభిన్నంగా థ్యాంక్స్ చెప్పాడు. జోరుగా ట్వీట్స్ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి ట్విట్టర్‌లో చేస్తున్న ట్వీట్స్ లో భాగంగా పూరి జగన్నాధ్ చెప్పిన వెల్‌కంకు చిరంజీవి చేసిన ట్వీట్ షాకిచ్చింది.
ఈ కరోనా కారణంగా థాయిలాండ్, బ్యాంకాక్ బీచ్‌లను నువ్వు బాగా మిస్ అవుతూ ఉంటావు కదా అంటూ సరదాగా మెగాస్టార్ ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్‌పై దర్శకుడు పూరి స్పందిస్తూ, ‘ఈ ట్వీట్ చూసిన సమయంలో నా భర్య పక్కనే ఉంది.ఆ ట్వీట్‌ను చూసి నా చెంప పగులగొట్టింది’ అని కామెంట్స్ చేశాడు. ‘చిరంజీవి గారు ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడో నాకే అర్థం కాలేదు’ అంటూ పూరి అసహనం వ్యక్తం చేశాడు.
కొత్త సినిమా మొదలు పెట్టాలంటే నెల రెండు నెలల పాటు పూరి థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్లి వస్తాడు.అక్కడ ప్రశాంతంగా స్క్రిప్ట్‌లు రాసుకుని వస్తాడు.ఆ తర్వాత షూటింగ్స్ మొదలు పెడతాడు.తన సినిమాల కథల నేపథ్యంను కూడా ఎక్కువగా అక్కడే ఎంచుకుంటాడు. షూటింగ్స్‌ను ఎక్కువగా అక్కడే షూట్ చేస్తాడు.భవిష్యత్తులో బ్యాంకాక్‌లోనే సెటిల్ అవ్వాలని ఉంది అంటూ గతంలో పూరి ఒకసారి చెప్పుకొచ్చాడు. అందుకే చిరు ఇప్పుడిలా ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ పూరి ఇమేజ్ బ్యాడ్ చేసేలా ఉందనే విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.