Movies

రామరాజు వీడియో వచ్చాక .మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది…ఆ సినిమా గుర్తుకు వస్తుందా

బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అద్బుతమైన కథతో.. విభిన్న పాత్ర లతో తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. మల్టీస్టారర్ గా రూపొందుతోంది. మెగా హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రంలో మరో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్నాడు. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామరాజు వీడియో వచ్చింది. ఆ వీడియో అద్బుతం అంటూ ప్రశంసలు దక్కించుకుంది. చరణ్ విజువల్స్ కు మెగా ఫ్యాన్స్ కళ్లలో ఆనందం నిండి పోయినప్పటికీ జక్కన్న ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అంటూనే పోలీస్ యూనిఫార్మ్ లో చరణ్ చూపించబోతున్నట్లు ఆ వీడియోలో జక్కన్న హింట్ ఇచ్చాడు.

అయితే అల్లూరి సీతారామరాజు పాత్రే కాని మీకు తెలియని విషయాలను నేను పూర్తిగా ఊహించి క్రియేట్ చేశాను అంటూ జక్కన్న గతంలోనే చెప్పాడు. కనుక అల్లూరి పాత్రలో చరణ్ ను పోలీసుగా జక్కన్న చూపించబోతున్నాడు. చరణ్ ను పోలీసుగా చూడబోతున్నామనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో విభిన్న టాక్స్ వస్తున్నాయి. చరణ్ పోలీస్ అనగానే ఎక్కువ శాతం ఫ్యాన్స్ కు జంజీర్ గుర్తుకు వస్తుందట. హిందీలో చేసిన జంజీర్ చిత్రంతో చరణ్ దారుణమైన డిజాస్ట్రర్ చవిచూశాడు. పోలీసుగా చరణ్ ఏమాత్రం కరెక్ట్ కాదని ఆ సమయంలో అంతా అనుకున్నారు. ఆ తర్వాత ధృవ చిత్రంలో ఐపీఎస్ గా చరణ్ నటించి మెప్పించాడు. అయితే చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు జంజీర్ ను గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారట.

ఆర్ఆర్ఆర్ లో చరణ్ పోలీసు అయితే జంజీర్ ఫలితం రిపీట్ అవ్వనుందా అనే టెన్షన్ కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని కొందరు మాత్రం ఇది చరణ్ సినిమా మాత్రమే కాదు రాజమౌళి సినిమా అనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. అంటే హీరోల సెంటిమెంట్తో పని లేకుండా జక్కన్న ని సూపర్ హిట్ చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. అందుకే ఆర్ఆర్ఆర్ విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని కొందరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈమూవీ కి టైటిల్ ఖరారు చేసినా ఆర్ ఆర్ ఆర్ గానే పిలుస్తున్నారు. ఇది కూడా ఓ ఎత్తుగడే అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."