సావిత్రి తన జీవితంలో తన పిల్లల గురించి కూడా ఆలోచించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి
సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కుటుంబాల్లో జరిగే ఘటనలను కళ్ళకు కట్టినట్లు సినిమాలు కూడా వస్తుంటాయి. అందులో “సంసారం ఒక చదరంగం” మూవీ ఒకటి. అప్పట్లో గొల్లపూడి మారుతి రావు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు నెలకొల్పడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. అయితే ఈ చిత్రంలో పని మనిషి చిలకమ్మ పాత్రలో నటించిన షావుకారు జానకి ఇంకా పలు చిత్రాల్లో చేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే వయసు మీద పడడంతో ప్రస్తుతం షావుకారు జానకి అడపాదడపా సినిమాల్లో అమ్మమ్మ, నానమ్మ పాత్రల్లో కనిపిస్తోంది.అలాగే పలు రకాల తెలుగు సీరియల్ ధారావాహికలో కూడా నటిస్తోంది.
అయితే ఇటీవలే షావుకారు జానకి ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన సినీ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలలో భాగంగా మహానటి సావిత్రి గురించి చెబుతూ, ఎమోషనల్ అయ్యింది. అప్పట్లో నటి సావిత్రి తాను మంచి స్నేహితులని చెప్పుకొచ్చింది.అంతేకాక చీరలు, నగల విషయంలో కూడా ఇద్దరి అభిరుచులు ఒకే లాగా ఉండేవని, కానీ తామంటే గిట్టని కొందరు తమ మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ ప్రచారం చేశారని, అయితే తమ గురించి తెలిసినవారు అవన్నీ నమ్మలేదని ఆమె స్పష్టంచేశారు.
అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరూ తమ సినీ జీవితాల్లో బిజీ అయ్యామని అందువలన తరచూ కలుసుకునే ఛాన్స్ రాలేదని కూడా షావుకారు జానకి చెప్పింది. తన గురించి ఒకానొక సమయంలో తెలిసిన కొన్ని వార్తల ఆధారంగా ఆమెను చూడడానికి తన ఇంటికి వెళ్లానని దీన పరిస్థితుల్లో ఉన్న సావిత్రిని చూసి తనకు కన్నీళ్లు అగలేదని షావుకారు జానకి ఎమోషన్ అయ్యారు. అంతేగాక సావిత్రి కూడా తనని చూసి ఏడ్చారని తెలిపింది.అలాగే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సావిత్రి తన పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేకపోయిందో అని ఇప్పటికీ చాలా బాధ పడుతూనే ఉంటానని ఆమె వివరించారు.

