తారక్ కోసం చరణ్ చెయ్యకుండా ఉంటాడా.!
మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ ప్రిస్టేజియస్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రంపై ఈ మధ్యనే మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో అల్లూరిగా కనిపిస్తున్న రామ్ చరణ్ కోసం భీం పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ఒక బహుమతి ఇవ్వగా ఇప్పుడు అంతా రామ్ చరణ్ ఇవ్వబోయే గిఫ్ట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అయితే అసలు ఇపుడు రామ్ చరణ్ ఇస్తాడా ఇవ్వడా అని సరికొత్త ప్రశ్న లేవనెత్తుతుంది.
రామ్ చరణ్ కోసం తారక్ చేయించిన వీడియో అలాగే దాని కోసం ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎంత ఇంపాక్ట్ కలగజేసిందో మనం చూసాము. అలా తారక్ కోసం చరణ్ తన గొంతుతో ఒక వీడియో వదులుతాడని అంతా ఫిక్స్ అయ్యిపోగా రామ్ చరణ్ అలా చెయ్యడు అని సరికొత్త వార్త ఇప్పుడు ప్రచారం అవుతుంది. అయినా చరణ్ కోసం తారక్ గిఫ్ట్ ఇచ్చినపుడు తారక్ కోసం చరణ్ ఇవ్వకుండా ఉంటాడా?
