ఆ జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం విషమం?హాస్పిటల్ నుండి నేరుగా షూటింగ్ కి..!
బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు మొదలై మాయమైపోతుంటాయి .అయితే కొన్ని కార్యక్రమాలు మాత్రం ప్రజల మన్ననలు పొందుతాయి. అలాంటి వాటిలో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఒకటి. 2013 లో మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా టిఆర్ పి రేటింగ్స్ పడకుండా నేటికీ దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్.
ఎప్పుడు నవ్వించే వారి జీవితాలలో కూడా విషాద ఛాయలు ఉంటాయి అని మనకు చార్లీ చాప్లెన్ జీవితం చూస్తే తెలుస్తుంది. సరిగ్గా అదే విధంగా ఒక ప్రముఖ కమెడియన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు .ట్రీట్మెంట్ చేయించుకొని నేరుగా హాస్పిటల్ నుండి షూటింగ్ కు వస్తున్నాడు. ఇంతకీ ఎవరితను..? వివరాలలోకి వెళ్తే.
జబర్దస్త్ షో నుండి ఎంతోమంది నటులు స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువమంది నటులు ఈ షో నుండే వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ షో నుండే ఎంతోమంది లైఫ్ అందుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇంతకీ ఆ విషాదం నెలకొన్నది పంచ్ ప్రసాద్ జీవితంలో . జబర్దస్త్ షో చూసే వాళ్లందరికీ ఈయన సుపరిచితుడు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తన టైమింగ్ పంచ్ లతో అలరిస్తూ ఉంటాడు.
అప్పట్లో వరుసగా షోస్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా మాయమయ్యాడు. దానితో జబర్దస్త్ షో మానేశాడేమో అనుకున్నారు ప్రేక్షకులంతా . కానీ ప్రసాద్ ఎందుకు రాలేదో ఏమైందో అని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి చెప్పారు. వెంకీ మంకీస్ టీంలో చేస్తున్నప్పుడే ప్రసాద్ మంచి జోష్ వున్న కమెడియన్ అని అర్ధమయింది అని, ప్రసాద్ అంతకంటే చాలా ఎమోషనల్ పర్సన్ అని చాలాకాలం తర్వాత తెలిసిందని అన్నారు నాగబాబు గారు. నాగబాబు ప్రసాద్ కి షార్ట్ టెంపర్ ఉండేదని దానికి అసలు కారణం తర్వాత తెలిసిందని నాగబాబు చెప్పారు.
ప్రసాద్ రెండు కిడ్నీలు 80 శాతం చెడిపోయాయని దాంతో బతకడం చాల కష్టం అని తన దగ్గరకి వచ్చి బాధపడే వాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు నాగబాబు. ఆ పరిస్థితిలో తనకు మనో నిబ్బరం కలిగించి తనకు ఆర్థికంగా సహాయం చేసి మా జబర్దస్త్ టీం అంత అండగా నిలిచామని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదంతా గతంలో జరిగింది మళ్ళి ఇప్పుడు ప్రసాద్ జబరదస్త్ లో రీఎంట్రీ ఇచ్చి మళ్ళి అందరిని నవ్వించడం మొదలుపెట్టాడు .తన ఆరోగ్యంపై తానే పంచ్ లు వేసుకుంటూ మరి నవ్విస్తున్నాడు ప్రసాద్ .కామెడీ కోసం చెప్పినా ఇదే వాస్తవం అంటున్నారు మిగిలిన కమెడియన్లు.

