కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? వరుడు ఆ బీజేపీ నాయకుడి కొడుకు?
మహానటి లాంటి ఉత్తమ కదా చిత్రాలలో నటించి అందరి మన్ననలు అందుకొని జాతీయ ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న ముద్దు గుమ్మా కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తా ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది .. తల్లితండ్రులు కుదుర్చిన వివాహం చేసుకోబోతున్న విషయం అంతటా చర్చ నెలకొంది ..కెరీర్ లో మంచి ఫామ్ లో వున్నా సమయంలో పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నలు ప్రస్తుతం వెల్లువిరుస్తున్నాయి …ఇంతకూ కీర్తి సురేష్ తో పెళ్లిపీటలు ఎక్కబోతున్నవారు ఎవరు అంటే …
అందం అందుకు తగ్గ నటన ఈ రెండు కంబినేషన్లో ప్రస్తుతం వున్నా హీరోయినెన్స్ లో కీర్తి సురేష్ ది బెస్ట్ అనడంలో ఏం సందేహం లేదు ..సావిత్రి మహానటి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పటు క్రిటిక్స్ మన్ననలు కూడా పొందారు .మహానటి చిత్రంతో ఆమె జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ..
ఇక కీర్తి సురేశ్య్ విషయానికి వస్తే …ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంతో కూడా సంబంధం వుంది ..తండ్రి సురేష్ వ్యాపారవేత్తనే కాకుండా కేరళ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు .తల్లి మేనక కూడా సినీ నటి ..అయితే తమ కూతురికి వివాహం చేసి తమ బాధ్యత నిర్వర్తించాలని పెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేశారనేది దక్షిణాది మీడియా రిపోర్ట్ …
కాగా బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని , ఆ సంబందాన్ని కుదిర్చే విదంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ..తల్లితండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ పాజిటివ్ గా స్పందిస్తున్నట్లు సమాచారం …కేరళలో బాగా పాపులర్ బిజినెస్ మ్యాన్ కోడలిగా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ..
పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తి తండ్రికి వున్నా స్నేహం కారణంగా పెళ్లి అరేంజ్డ్ గా చేసే పనిలో నిమగ్నం అయ్యారని సినీ ,రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు ..కాగా ఓ బిలియనీర్ పెళ్ళికొడుకు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది …
దక్షిణాది మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా కీర్తి సురేష్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది .అయితే కీర్తి తల్లితండ్రులు మాత్రం పెళ్లి గురించి ఏ విషయాన్నీ కన్ఫర్మ్ చేయలేదు ..కాగా త్వరలో ఈ విషయం గురించి వెల్లడించే అవకాశం వుంది అని అంటున్నారు ..కీర్తి కూడా ఈ వార్తలపై ఇప్పటిదాకా ఏ విదంగాను స్పందించకపోవడంతో పెళ్లి గురించి వస్తున్నా వార్తలు నిజమే అనే విదంగా వార్తలు వస్తున్నాయి ..కాగా రెండు కుటుంబాలు చర్చలు పూర్తికాగానే అసలు విషయం బయటకు వస్తుందని సమాచారం .
జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పేరుతెచున్న కీర్తి ఈ సమయంలో పెళ్లి ఏంటి అని ఆమె ఇంకా తన నటనపై ద్రుష్టి సారించి ఇంకా ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేయాల్సిన అవసరం వుంది అని .అయిన ఇప్పుడు పెళ్లి ఏంటి అని కీర్తి సన్నిహిత వర్గం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు ..
