Movies

ఈ యూజర్లకు బన్నీ సినిమా అందుబాటులో ఉండదా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఈ మధ్యనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు టెలివిజన్ తెరపై టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

దీనికి ముందు డిజిటల్ గా వచ్చిన ప్రింట్ కోసం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే.ఎందుకంటే ఈ చిత్రం డిజిటల్ హక్కులను “సన్ నెక్స్ట్” వారు సొంతం చేసుకున్నారు. అదే విధంగా వేరేయితో పాటు నెట్ ఫ్లిక్స్ వారు కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి ఉంది.

కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ముడి ఉంది. సన్ నెక్స్ట్ లోకి వచ్చే ఏ సినిమా అయినా సరే జియో నెట్వర్క్ వినియోగదారులకు కూడా చూసే వెసులుబాటు ఉంది. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలీకపోవచ్చు. జియో సినిమా అనే యాప్ లో “సన్ నెక్స్ట్” ఆప్షన్ ద్వారా అందులో వచ్చే అన్ని సినిమాలను షోలను మరెన్నో చూసే అవకాశం ఫ్రీ గానే ఉంది.

అలా సన్ నెక్స్ట్ లో ఉండే అన్ని సినిమాలు అంతెందుకు ఈ మధ్యనే వచ్చిన “డిస్కో రాజా” కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ “అల వైకుంఠపురములో” రాలేదు. ఈ చిత్రం కోసం అప్పట్లోనే చాలా మంది ఎదురు చూసారు. కానీ ఇప్పటికీ రాలేదు. మరి దీనికి గల కారణం ఏమిటి అన్నది ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."