Business

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ముఖేశ్ అంబానీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా?

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా చాలా దేశాలు కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో కూడా లాక్‌డౌన్ పాటిస్తుండడంతో దీని ప్రభావం సామాన్యుడి నుంచి ధనికుడి వరకు అందరిపై చూపుతుంది.

అయితే మన దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుందట. మార్చ్ 31నాటికి రోజుకి 300 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా 19 బిలియన్ డాలర్ల మేర సంపద కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అంబానీ 8వ స్థానానికి పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితే చాలా మందికి ఎదురవ్వడంతో అనేక మంది తమ ర్యాంకింగ్స్ కోల్పోయి చతికిలపడ్డారు. అయితే ప్రస్తుతం భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ మాత్రమే టాప్‌ 100 జాబితాలో నిలిచాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."