Movies

ఏప్రిల్ 8…ఈ తారీఖుతో చిరంజీవికి సంబంధం ఏమిటో… !

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లోకి వచ్చినప్పటి నుండి తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై తనదైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఒక ఆసక్తి కరమైన పోస్ట్ ఒకటి చేశారు. ఏప్రిల్ 8 అని చెబుతూ, ఆ తారీఖు తో నాకు బోలెడంత అనుబంధం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఇది సశేషం, ఇంకా మిగిలివుంది అంటూ తెలిపారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 కావడం గమనార్హం. అయితే ఈ తేదీకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల ఎపుడు అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆ పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిరు తన అనుబంధం గురించి ఏం చెబుతారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."