Movies

ఒక్క సీన్ తో ఫస్ట్ ఎవర్ రికార్డ్ కొట్టిన “రెబల్” స్టార్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ వేరే అని అందరికీ తెలుసు. దీనికి ముందు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎనలేని క్రేజ్ ప్రభాస్ సొంతం. అయితే ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమాలకు వచ్చే ఆదరణ ఏమో కానీ ఒక ప్లాప్ కు వచ్చిన ఆదరణ చూస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అని చెప్పాలి.

ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఏదన్నా ఉంది అంటే అది లేటెస్ట్ “సాహో” అని అంటారు అందరూ. కానీ దీనికి ముందు ఎప్పుడో వచ్చిన ఒక పక్కా మాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “రెబల్”. టైటిల్ లోనే ఎంతో పవర్ నింపిన దర్శకుడు లారెన్స్ ఈ చిత్రంలో ప్రభాస్ కు బాక్సాఫీస్ దగ్గర మాత్రం హిట్టివ్వలేకపోయారు.

అయితేనేం దానిని మించిన రెస్పాన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో రాబట్టాడు. రెబల్ క్లైమాక్స్ ఫైట్ సీన్ కు ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కూడా తెలుగు వెర్షన్ లో ఇలా కేవలం ఒకే ఒక్క సీన్ కు 100 మిలియన్ వ్యూస్ రావడం మన ఇండియన్ హిస్టరీ లోనే లేదు. దీనితో ఇలాంటి ఒక ఫస్ట్ ఎవర్ రికార్డు కొట్టిన ఏకైక తెలుగు హీరో మన డార్లింగ్ అనే చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."