Movies

మొన్న “దిల్”రాజు ఇప్పుడు అల్లు అరవింద్…ఏమిటో చూడండి

ఇప్పుడు కరోనా కారణంగా ప్రతీ ఒక్కరిని ఇళ్లల్లోనే ఉండాలని ఒక పక్క ప్రభుత్వం వారు చెప్తున్నారు. అలాగే వారితో పాటుగా సినీ ఇండస్ట్రీ వారు కూడా తమ ఫాలోవర్స్ కు మనవి చేస్తున్నారు. అలా ఇళ్లలోనే ఊరికే ఉండకుండా తమ సినిమాలను చూసి ఎంజాయ్ చెయ్యమని కూడా మన నిర్మాణ సంస్థల వారు చెప్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వారు తెలుగు ఆడియెన్స్ ను ఇళ్లల్లోనే ఉంది అమెజాన్ ప్రైమ్ లో ఉన్న తమ సినిమాలు చూసి ఎంజాయ్ చేసి ఇంట్లోనే సేఫ్ గా ఉండాలని మనవి చేసారు.

అలాగే ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయినటువంటి “గీతా ఆర్ట్స్” వారు కూడా తమ ఫాలోవర్స్ ను ఇళ్లలోనే సేఫ్ గా ఉండి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ఉన్న తమ సినిమాలు చూడమని చెప్తున్నారు. అలా తమ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో” నుంచి “సరైనోడు” వరకు ఏఏ డిజిటల్ యాప్స్ లో అవి అందుబాటులో ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచారు. ఇలా మన తెలుగు నిర్మాతలు తమ సినిమాలను మరోసారి రిపీట్ వేస్కోమని చెప్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."