Movies

బుల్లితెర మీద సందడి చేయటానికి రెడీ అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వెండితెరపై రికార్డులు సృష్టించడమే కాదు.. బుల్లితెరపైనా సత్తా చాటేశాడు. బిగ్‌బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ వన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్‌ టైగర్‌, టీఆర్పీ రేటింగుల దుమ్ము దులిపేశాడు. ఆ తర్వాత మరో రెండు సీజన్లు వచ్చినా, యంగ్‌ టైగర్‌ హోస్టింగ్‌ని ఇప్పటికీ బుల్లితెర వీక్షకులు మర్చిపోలేదు. ఆనాటి ఆ రియాల్టీ షోని ఇప్పుడు మళ్ళీ ప్రసారం చేయబోతున్నారనగానే, యంగ్‌ టైగర్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తన్నుకొచ్చింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా విడుదలవుతోందా? అనే స్థాయిలో సోషల్‌ మీడియాలో హంగామా జరుగుతోందిప్పుడు.

ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్ లో బిగ్‌బాస్‌ సీజన్‌ వన్‌ పునఃప్రసారం కాబోతోంది.. అన్నట్టు హైలైట్స్‌ మాత్రమేనండోయ్‌. అయినాగానీ, ఈ రియాల్టీ షో కోసం అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూసేస్తున్నారు. అదీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సత్తా అంటే. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో, షూటింగులు నిలిచిపోయాయి. దాంతో, టీవీ సీరియళ్ళ కొరత ఏర్పడింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో స్లాట్స్‌ ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రకటనలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ లోటు లేకుండా ఆయా ఛానల్స్‌ ‘రిపీట్‌ ప్రోగ్రామ్స్’ మీద ఫోకస్‌ పెట్టాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ రియాల్టీ షో పునఃప్రసారానికి ప్లాన్‌ చేశారన్నమాట. కారణం ఏదైతేనేం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బుల్లితెరపై ఇచ్చే ఆ కిక్కే వేరప్పా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."