Healthhealth tips in telugu

కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వేధిస్తున్నాయా? మీ రోజువారీ టీకి బదులు ఈ హెర్బల్ టీ తాగి చూడండి!

joint pains home remedies in telugu : మారిన జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది కీళ్ల నొప్పులు (Joint Pains), వెన్నునొప్పి మరియు అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మన వంటింట్లో ఉండే సహజ ఔషధ గుణాలు కలిగిన దినుసులతో తయారు చేసుకునే హెర్బల్ టీని (Herbal Tea) రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో వాపు (Inflammation) తగ్గడంతో పాటు మెటబాలిజం మెరుగుపడుతుంది. ఈ హెర్బల్ టీ తయారీ విధానం మరియు కలిగే ప్రయోజనాల గురించి ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మందులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలా కాకుండా సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. .

సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ సూచనలు కూడా తప్పని సరిగా పాటించాలి.ఈ రోజుల్లో వచ్చే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్,అధిక బరువు వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ చిట్కా కోసం కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

వాము, కలోంజీ విత్తనాలు… ఈ రెండింటిని ఈ చిట్కా కోసం ఉపయోగిస్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ వాము,పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన వాము కలోంజి విత్తనాలు తింటూ ఆ నీటిని తాగాలి.మరో విధంగా కూడా వీటిని తీసుకోవచ్చు.
Joint Pains
ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి పావు స్పూను వాము, పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి వడగట్టి ఆ నీటిని తాగాలి. ఈ నీటిలో తేనె కూడా కలుపుకోవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Weight Loss tips in telugu
వాము,కలోంజీ విత్తనాలు రెండూ కూడా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ ని తయారుచేసుకొని తాగితే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అధిక బరువు వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. కలోంజీ విత్తనాలు ఆయుర్వేదం షాప్ లలోనూ, online stores లో లభ్యం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

#JointPainRelief #BackPainRemedy #WeightLossTea #HerbalTeaTelugu #TeluguHealthTips #ArogyaChitkalu #NaturalRemediesTelugu #HealthyLifestyleTelugu

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."