ఈ మెగా హీరో సినిమా పరిస్థితి ఏమిటో…బాగా ఇరుక్కుపోయాడు
మెగా కంపౌండ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఇందులో కొందరు స్టార్ స్టేటస్ తెచ్చుకోగా, మరికొందరు కుస్తీ పడుతున్నారు. తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తీస్తున్న . ‘ఉప్పెన’ ద్వారా కథానాయకుడిగా మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వైష్ణవ్ తేజ్ అరంగేట్రం చేస్తున్నాడు. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా కి నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చుచేశారట. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరో హీరోయిన్ దర్శకుడు అంతా కొత్తవాళ్లే కావడంతో నిర్మాతలు చెప్పిన రేటుకి ఈ సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమా పై హైప్ క్రియేట్ చేసినా కరోనా లాక్ డౌన్ వలన సినిమాకి చాలా కష్టాలే వచ్చాయి. అంతేగాక ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్ కంటే విలన్ విజయ్ సేతుపతి కృతి శెట్టి పాత్రలకే స్కోప్ ఎక్కువని టాక్.
ఈ వార్త మెగా అభిమానులను నిరుత్సాహపరుస్తుంది. ఇంతకాలం వెయిట్ చేసిన వైష్ణవ్ ఎందుకని తనకు స్కోప్ లేని పాత్రను కథను ఎంచుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తెరమీద అరంగేట్రం చేయాలనుకున్న వైష్ణవ్ క్రెడిట్ అంతా విలన్ హీరోయిన్ కొట్టేయడం బాధాకరమని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇక డిజిటల్ రైట్స్ కూడా ఆశించిన స్థాయిలో పలకడం లేదట. ఈ సినిమా వైష్ణవ్ నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో తెలీడం లేదు. ఏది ఏమైనా ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ కి మాత్రం మూవీపై కొండంత ఆశ ఉందట.
