Movies

”బాహుబలి 2”ని తలదన్నేలా “RRR” అన్నిట్లోనే ఎక్కువే అట.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మరియు విజువల్ ట్రీట్ “రౌద్రం రణం రుధిరం”. బాహుబలి లాంటి ఎపిక్ వండర్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడం అందులోను ఇద్దరు స్టార్ హీరోలతో తియ్యడంతో ఈ సినిమాపై బాహుబలిని మించిన అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే అంచనాల పరంగా బాహుబలి 2 ను ఎప్పుడో దాటేసిన ఈ చిత్రం కంటెంట్ మరియు అవుట్ ఫుట్ ప్రకారంగా కూడా దానిని మించిన విధంగానే ఉండబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రం బాహుబలి 2 సినిమా కంటే ఎక్కువ నిడివి తోను అలాగే మొత్తం 10 పాటలతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇదంతా ఆడియన్స్ అంచనాలను అందుకోడానికి రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.