Movies

పవన్ కళ్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయ కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా కూడా సామాజిక సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ ముందుకి వెళ్తున్నాడు.ఇదే సమయంలో ప్రస్తుతం కొంత గ్యాప్ దొరకడంతో ఓ రెండేళ్ళు సినిమాలు చేయడానికి రెడీ అయ్యి ఇప్పటికే రెండు సినిమాలని స్టార్ట్ చేసేసాడు.అందులో పింక్ మూవీ షూటింగ్ చివరి దశకి చేరుకుంది.

ఇక క్రిష్ మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల గురించి నాగబాబు తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.పింక్ సినిమాపై ముందు నుంచే ప‌వ‌న్ చాలా ఆస‌క్తి చూపించాడ‌ు.పింక్ రీమేక్ చేయాల‌నుంద‌ని ఒక‌ట్రెండు సార్లు నాకు చెప్పాడ‌ు.రెండు భాష‌ల‌తో పోలిస్తే క‌చ్చితంగా తెలుగులో మ‌రో 10 శాతం బెట‌ర్మెంట్ చేశారు.తెలుగులో ప‌వ‌న్ అభిమానుల కోసం కొన్ని మార్పులు అయితే చేశారు.

పవన్-క్రిష్ మూవీ మొగ‌లాయిల చుట్టూ తిరిగే క‌థ.సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుంది అని నేను విన్నాను.నిజంగా ఇది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది.క్రిష్ కూడా పవన్‌కు స‌రిపోయేలా రెడీ చేస్తున్నాడ‌ు.ఈ రెండు సినిమాలు త‌ప్పకుండా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడం ఖాయం నాగబాబు ఫ్యాన్స్ తో తన అభిప్రాయం పంచుకున్నారు.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాలు ఎప్పుడు తెరపైకి వస్తాయా, ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.