గుణశేఖర్ మాయాజాలంకు 125 మిలియన్లు.!

మన టాలీవుడ్ లో భారీ చిత్రాలు సెట్టింగులు అంటే ఇప్పుడు రాజమౌళి అని అంటారు కానీ రాజమౌళి కన్నా ముందే తెలుగు తెరకు కళ్ళు చెదిరే భారీ సెట్టింగులను చూపించి మాయ చేసిన దర్శకుడు మాత్రం గుణశేఖర్ అని చెప్పాలి. అలాగే హిస్టారికల్ చిత్రాలంటే అపారమైన ఇష్టం ఉన్న దర్శకుల్లో గుణశేఖర్ కూడా ఒకరు.

అలా మన సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క మెయిన్ లీడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రానా లు కీలక పాత్రల్లో నటించిన పీరియాడిక్ మరియు పాన్ ఇండియన్ చిత్రం “రుద్రమదేవి”. మన తెలుగులో మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ 3డి సినిమాగా ఇది తెరకెక్కి ఒక కొత్త అనుభూతిని అందించింది.

అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో 125 మిలియన్ మార్కును అందుకోగా ఆ విషయాన్ని గుణశేఖర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో గోనగన్నా రెడ్డిగా కనిపించిన బన్నీ ఈ సినిమాకు హైలైట్ కాగా మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.