Movies

మహేష్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

అయితే ఈ సినిమా ఇటీవలే జెమినీ ఛానెల్లో ప్రసారం కాబడి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైం రికార్డు టీఆర్పీ రేటింగ్ ను కొల్లగొట్టింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ అనుకున్నట్టుగానే భారీ టీఆర్పీ రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే అనుకుంటే ఈ ఆనందం ఇప్పుడు డబుల్ కాబోతుంది అని చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఒరిజినల్ ప్రింట్ తో మరోసారి టెలికాస్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని ముందు తీసివేసిన సన్నివేశాలను కూడా కలిపి రెండోసారి టెలికాస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక అప్డేట్ లేదు కానీ ఇదే నిజం అయితే మహేష్ మరోసారి ఖచ్చితంగా ఆల్ టైం రికార్డు కొట్టడం ఖాయం అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."