Movies

బాలయ్య ఈ యాక్టర్ ని రికమెండ్ చేసాడట…ఆ యాక్టర్ ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ చాలా గ్యాప్ తరువాత తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

ఇప్పటి వరకు కేవలం తొలి షెడ్యూల్‌ను మాత్రమే పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, నటీనటుల వేటలో చాలా బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడు.అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఎవరిని తీసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్న చిత్ర యూనిట్‌కు బాలయ్య ఒక యాక్టర్‌ను రికమెండ్ చేశాడట.టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న నటుడు రావు రమేష్ పేరును బాలయ్య రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.

బోయపాటి కూడా బాలయ్య మాటకు వెంటనే ఒప్పుకుని రావు రమేష్‌ను ఈ సినిమాలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.బాలయ్య-రావు రమేష్‌ల మధ్య రాబోయే సన్నివేశాలు చాలా బాగుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.మొత్తానికి బాలయ్య మాటను బోయపాటి తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇటీవల ఈ సినిమా హీరోయిన్ విషయంలోనూ శ్రీయా పేరును బాలయ్య రికమెండ్ చేయడం, బోయాపాటి ఒప్పుకోవడం తెలిసిన సంగతే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."