Movies

హీరోని దాటి పారితోషికం తీసుకుంటున్న పూజ…డిమాండ్ ఆలా ఉంది

ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైమ్ వస్తుంది. సరిగ్గా ఇప్పుడు పూజ హెగ్డే అలాంటి సమయం వచ్చింది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఓ వెలిగిపోతుంది వరుస హిట్లతో టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా చేస్తోంది.

తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ భామ త్వరలో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతుందని టాక్. ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హీరోయిన్ నటించడానికి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. అదీగాక అందరి హీరోయిన్ల కంటే పారితోషికం రేట్లు కూడా భారీగా పెంచేసిందట. ప్రస్తుతం హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే నిర్మాతలు బన్నీవాసు, వాసు వర్మలు ఎక్కువ చెల్లిస్తున్నారట.

ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ లోకి పూజ చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతోందని,దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఏ సినిమా ఓకే చేయాలన్నా ముందు నా రెమ్యూనరేషన్ చూసి అడగండి అనే రేంజ్ లో ఈ భామ బిల్డప్ ఇస్తోందట. తప్పదు మరి డిమాండ్ అలాంటిది మరి.