Movies

పవన్ సినిమాలను ఒప్పుకోవటం లేదా…కారణం ఇదేనట

కరోనా మహమ్మారి అందరినీ దెబ్బతీసింది. అన్ని రంగాలను కుంగదీసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అయినా లాక్ డౌన్ శరణ్యం కావడంతో మళ్ళీ పొడిగించారు. లాక్ డౌన్ మే3వరకూ పొడిగించారు. ఇక ఇప్పటికే మూతపడ్డ సినిమా ఇండస్ట్రీ లాక్ డౌన్ తో తెరవలేని పరిస్థితి వచ్చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి సినీ రంగానికి రీ ఎంట్రీ ఇస్తూ,పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది.

అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే గప్ చిప్ అన్నట్లు ఇళ్లకు పరిమితమయ్యారు. కాకపొతే పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్నాడు. అయితే కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి, ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేసాడు. అయితే మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది.

అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే కొత్త సినిమాలేవీ ఓకే చేయకూడని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించిన ఒప్పందాలు ఆపేయాలని అనుకుంటున్నట్లు టాక్. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడడంతో మిగిలిన సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పడం కష్టం. అందుకే అవి ఉంటాయో క్యాన్సిల్ అవుతాయో వేచి చూడాలి.