Movies

“సరిలేరు నీకెవ్వరు” రెండో టెలికాస్ట్ ఎప్పుడో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. సంక్రాంతి కానుకగా విడుడలయ్యి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ చిత్రం బుల్లితెర మీద కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని మొదటిసారి టెలికాస్ట్ చేసిన జెమినీ టీవిలో ఆల్ టైం టీఆర్పీ రికార్డు నమోదు అయ్యింది.

దీనితో పాటుగా మళ్ళీ ఇదే గ్యాప్ లో ఈ చిత్రం రెండోసారి టెలికాస్ట్ కు సిద్ధం కానుంది అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈసారి డిలీట్ చేసిన సన్నివేశాలు మరియు ఒరిజినల్ హై క్వాలిటీ ఆడియోతో టెలికాస్ట్ కానుంది అనడంతో ఈసారి కూడా మహేష్ అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి డేట్ కుదిరినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు ఈ ఏప్రిల్ 26 ఆదివారం గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈసారి కూడ మహేష్ ఆల్ టైం టీఆర్పీ నెలకొల్పుతారో లేదో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."