Movies

2020ని టాలీవుడ్‌ మర్చిపోవాల్సిందేనా ?

ఏప్రిల్‌ నెలలో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కన్పించడంలేదు. మే నెలలోనూ పరిస్థితి ఇలాగే వుండొచ్చు. జూన్‌ నాటికి పరిస్థితులు ఓ కొలిక్కి రావొచ్చునన్న చర్చ జరుగుతుండగా, ఆ ఆలోచన అస్సలేమాత్రం సబబు కాదని మరికొందరు అంటున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో, పరిస్థితులు ఇప్పుడప్పుడే అంత అనుకూలంగా మారతాయని అనుకోవడానికి వీల్లేదట. ఓ అంచనా ప్రకారం సెప్టెంబర్‌ నాటికి కొంత ఉపశమనం దొరుకుతుందట. అయితే, సెప్టెంబర్‌ కూడా కాదు, ఈ ఏడాదిని టాలీవుడ్‌ మర్చిపోవాల్సిందేనని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా, జనం కొంత కాలం పాటు ‘గుమికూడకుండా’ వుండటమే మంచిదని గత అనుభవాలు చెబుతుండడంతో, సినిమా దియేటర్లకు ఇప్పట్లో అనుమతులు రాకపోవచ్చునన్నది ఓ వాదన.

సినిమాల రిలీజ్‌కి అనుకూల పరిస్థితుల్లేకపోతే, సినిమా షూటింగులు జరిగి మాత్రం ఏం లాభం.? అని కొందరు పెదవి విరవడం మామూలే. అందులో నిజం కూడా లేకపోలేదు. ఇదంతా పెద్ద ట్రాష్‌.. ఒక్కసారి పరిస్థితి అదుపులోకి వస్తే, ఆ తర్వాత ఇబ్బంది ఏమీ వుండదని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇది ఇక్కడ పుట్టిన వైరస్‌ కాదు.. గాల్లో ఎక్కువ రోజులు వుండదు. లాక్‌డౌన్‌తో మంచే జరిగింది. మొత్తంగా దేశం నుంచి కరోనా వైరస్‌ని తరిమికొట్టడానికి ఇదే సరైన విధానం. వీలైనంత త్వరగా సినీ పరిశ్రమకు తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నాం..’ అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సో, 2020ని టాలీవుడ్‌ మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద హిట్లు పడ్డాయి. సమ్మర్‌ని మిస్‌ అవబోతున్నామంతే. ఆ తర్వాత మళ్ళీ సినిమాల జాతర చూడబోతున్నాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."