Movies

మెగా బయోపిక్ ఖాయమా …చిరుగా ఎవరు నటిస్తారో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఒక్కో టైం లో ఒక్కో ట్రెండ్ ఉంటుంది. ఈమధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ బానే వస్తున్నాయి. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌మ చూపులు బ‌యోపిక్స్ వైపు వేస్తున్నారు. ఎందుకంటే, బ‌యోపిక్ చేయ‌డానికి క‌థ కొత్త‌గా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను కాస్త సినిమాటిక్ ట‌చ్ ఇచ్చి తెర‌కెక్కిస్తే సరిపోతుంది. ఇలా కొంచెం ఈజీగా ఉండడం వలన అంద‌రి జీవితాల‌ను తెర‌కెక్కించే బాధ్య‌త ద‌ర్శ‌కులు తీసుకుంటున్నారు. తెలుగులో సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి విజయం సాధించి, కమర్షియల్‌గా కూడా ఈ సినిమా ప్రభంజనమే సృష్టించింది. నిర్మాతలకు దాదాపు మూడింతలు లాభాలు తీసుకొచ్చింది. దాంతో పాటే నేషనల్ అవార్డు కూడా సాధించింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చి ప్లాప్ అయింది. చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. బాల‌య్య ఎప్ప‌టికీ స‌రిదిద్దుకోలేని త‌ప్పు గా ఈ బయోపిక్ నిల్చింది.

అయితే వైఎస్ఆర్, జార్జ్ రెడ్డి లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ పర్వాలేదనిపించాయి. మొత్తానికి లెజెండ్స్ లైఫ్ తెరపై చూడ్డానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి గానే ఉన్నారు. తాజాగా చిరంజీవి బ‌యోపిక్ కూడా వ‌స్తుందేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తీస్తే బాగుంటుందేమో అనే చ‌ర్చ మొద‌లైందిప్పుడు. గతంలో నాగ‌బాబు స్పందిస్తూ, అన్నయ్య చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచ‌న కానీ.. ఉద్దేశ్యం కానీ అస్స‌లు లేవ‌ని చెప్పాడు. అన్న‌య్య జీవితం అంద‌రికీ ఆద‌ర్శంగానే ఉంటుంది కానీ ఆయ‌న జీవితంలో బ‌యోపిక్ చేయాల్సిన‌న్ని అంశాలు మాత్రం లేవ‌ని చెప్పాడు. గ‌తంలోనే ఈ విష‌యంపై మాట్లాడిన నాగ‌బాబు ఇప్పుడు అదే చెప్పాడు.

ఇక ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్‌పై మనసులో మాట బయట పెట్టేసాడు. తన జీవితంలో ఎక్కువగా ఎత్తుపల్లాలు లేవని.. బయోపిక్ చేసేంత ఎమోషన్స్ ఉండవని తేల్చేసాడు. తన జీవితంలో అలాంటి ఎమోష‌న‌ల్ సీన్స్ లేవ‌ని, డ్రామా పండించే సీన్స్ లేక‌పోతే బ‌యోపిక్ పండ‌ద‌న్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో జీవిత కథ రాస్తున్నట్లు మెగాస్టార్ ప్రకటించాడు. దాన్నే బుక్ రూపంతో పాటు డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తామంటున్నాడు. అయితే బయోపిక్ చేసే ఆలోచన అయితే లేదని తేల్చేసాడు. దీంతో క్లారిటీ వచ్చేసింది.