ఈ లాక్ డౌన్ లో అదిరిపోయే టీఆర్పీ రాబట్టిన “సంక్రాంతి”.!
మన టాలీవుడ్ లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉన్న స్వచ్ఛమైన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. అభిమానులు అంతా ముద్దుగా పిచుకునే వెంకీ మామ కెరీర్లో ఉన్న ఫ్యామిలీ ఎంతెర్తైనింగ్ సినిమాలను ఇష్టపడని వారు ఉండరు.
అలా వెంకీ మామ నటించిన కొన్ని అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కించిన “సంక్రాంతి” సినిమా కూడా ఒకటి. “ఆనందం” అనే తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
వెంకటేష్ సహా శ్రీకాంత్,స్నేహ,సంగీత ఆర్తి అగర్వాల్,శర్వానంద్,బిగ్ బాస్ 2 విన్నర్ శివాజీ లు నటించిన ఈ చిత్రం 2005 లో విడుదలై దాని ప్రభావం ఇప్పటికీ ఏ రేంజ్ లో ఉందో మరోసారో నిరూపితం అయ్యింది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అన్ని కుటుంబాలు ఇళ్లకే పరిమితం అయ్యాయి.
ఈ సమయంలో గత వారం ఈ చిత్రాన్ని జెమినీ ఛానెల్ వారు 1-4 స్లాట్ లో టెలికాస్ట్ చెయ్యగా దీనికి గాను 6.45 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్నేళ్లు అయినా సరే ఈ సినిమాకు ఈస్థాయి రేటింగ్ వచ్చింది అంటే ఈ సినిమా వారికి ఎంతలా కనెక్ట్ అయ్యి ఉంటుంది.

