ఆచార్య సినిమా కారణంగా కొరటాల శివకు 30 కోట్లు నష్టమట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోంది.ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ ఏకంగా మూడూ సంవత్సరాలు కేటాయిస్తున్నాడు.2018లో భరత్ అనే నేను చిత్రం రిలీజ్ తరువాత మెగాస్టార్ సినిమాను ప్రారంభించేందుకు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది.ఇక సైరా నరసింహారెడ్డి తరువాత ఆచార్యను మొదలుపెట్టిన కొరటాల, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమాను 2021లోనే రిలీజ్ చేయగలనని అంగీకరించారు.

ఈ లెక్కన ఆయన ఈ సినిమాకు మూడేళ్లు కేటాయించాల్సి వస్తుంది.అయితే కొరటాల ఏడాదిన్నరలో ఒక సినిమా చేసి, సినిమాకు రూ.15 కోట్లు వసూలు చేసేవాడు.ఇప్పుడు ఆచార్య దెబ్బకు రూ.30 కోట్ల మేర నష్టపోతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.