RRRలో రామ్ చరణ్ లుక్ మరోలా కూడా ఉండబోతుందా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇదిలా ఉండగా ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చర్మం పుట్టిన రోజు సందర్భంగా తారక్ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం మాములుగా లేదని చెప్పాలి. రామరాజు కోసం భీం ఇస్తున్న గిఫ్ట్ అని ప్రచారం చేసిన ఈ టీజర్ వీడియో ఇండియా వైడ్ సెన్సేషన్ అయ్యింది.
అయితే ఈ ఈ సినిమాలో రామ్ చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారన్న విషయం విదితమే. కానీ అల్లూరి సీతారామరాజు అంటే మన తెలుగు ప్రేక్షకులకు గుబురు గడ్డం పొడవాటి శిరోజాలతో నిలబడే ఉక్కు దేహం విజువల్ ప్రత్యక్షం అవుతుంది.
కానీ ఆ విజువల్స్ ను బ్రేక్ చేస్తూ రాజమౌళి రామ్ చరణ్ సీతారామ రాజుగా కొత్త యాంగిల్ చూపించారు. దానితో ఈ సినిమాలో తాము ఊహించుకున్న లుక్ లో చరణ్ కనిపించరా అన్న సంశయంలో చరణ్ అభిమానులు పడ్డారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తాము కోరుకున్న లుక్ లో కనిపిస్తాడు అనిపిస్తుంది.
ఎందుకంటే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో బయటకొచ్చిన ఫోటోలు చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. RRR సెట్స్ లో అలా నడుచుకుంటూ వచ్చిన స్టిల్ బయటకు వచ్చింది. దీనితో ఈ సినిమాలో రామ్ చరణ్ లో రెండు మూడు వేరియేషన్స్ ఖచ్చితంగా చూడొచ్చని చెప్పొచ్చు.
